సత్తాచాటిన కూటమి…

– నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు.. అసెంబ్లీ కంటే 20 వేలు
– బీఆర్‌ఎస్‌ ఓట్లు…బీజేపీకి….?
నవతెలంగాణ-కొత్తగూడెం
” కలిసి ఉంటే కలదు సుఃఖం ..’ అన్న నానుడి ఈసారి జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది….కూటమి ఏర్పాటుతో కాంగ్రెస్‌ పార్టీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను నమోదు చేసుకుని అధికారులకు వచ్చిన విషయం విధితమే…లోక్‌సభ ఎన్నికల్లో సైతం అదే తంతు కొనసాగింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ సీపీఐ(ఎం), సీపీిఐ, జన సమితి పార్టీల బలాలతో ఖమ్మం లోక్‌ సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముందే గెలుపు ఊహించినప్పటికీ ఎన్నికల్లో పోటీ ఉన్న నేపథ్యంలో ప్రచారాలు జోరుగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ దాని అనుబంధ కూటమి పార్టీల నాయకుల ప్రచారాలు తప్పా ప్రత్యర్థుల ప్రచారాలు పెద్దగా కనిపించలేదు. బీఆర్‌ఎస్‌ ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకులు కేసీఆర్‌ రోడ్‌ షోలు చేశారు. బీజేపి జాతీయ అద్యక్షులు నడ్డా బహిరంగ సభ నిర్వనిర్వహించారు. కూటమి ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి కొత్తగూడెంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ జోరులో ఇరత పార్టీల ప్రచారాలు కొట్టుకుపోయినట్టే కనిపించింది…. ప్రతి ఒక్కరూ చాలెంజిగా తీసుకుని రామ సహాయం రఘురామిరెడ్డి గెలుపుకు కృషి చేయడంతో ఫలితం ఆశించిన మేర లభించిందని స్పష్టమవుతుంది.
ఖమ్మం లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి ఓట్లు వేశారు. పొత్తు ధర్మంతో కాంగ్రెస్‌, సిపిఐ, సీపీఐ(ఎం), జన సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియో జకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే 20వేల ఓట్లు అత్యధికంగా పోలైనట్లు గణంకాలు చెబుతున్నాయి. బిఆర్‌ఎస్‌ అభ్యర్థికి అసెంబ్లీలో వచ్చిన ఓట్లు కూడా పెద్దగా క్రాస్‌ ఓటింగ్‌గా మారి బిజెపికి పోలైనట్టుగా ప్రచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ గూటికి వలసలు పట్టారు. అప్పటికే లోక్‌ సభ ఎన్నికలు ప్రచారం ప్రారంభం కావడంతో కూటమి నాయకులతో కలిసి పనిచేశారు. విస్తృత ప్రచారం నిర్వహించారు. కారణంగా రామ సహాయం రఘురాం రెడ్డికి కొత్తగూడెంలో 1లక్ష ఓట్ల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. పార్టీల సమీకరణాలు మారిన నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ వారు బిజెపి పార్టీకి క్రాస్‌ ఓటింగ్‌ చేశారని ప్రచారం జరుగుతుంది. ఖమ్మం పార్లమెంటు స్థానానికి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న నామ నాగేశ్వరరావు కొత్తగూడెం నియో జకవర్గంలో పెద్దగా ప్రచారం నిర్వహించకపోవడంతో ఓట్లు తగ్గినట్లు తెలుస్తుంది. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి పేరు ప్రకటించిన నాటినుండి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా ఉందని ముందే అర్థమైంది. దీనికి తోడు స్టార్‌ క్యాంపన్‌గా ప్రముఖ సినీ నటుడు వెంకటేష్‌, ఖమ్మం వైరా, తల్లాడ, కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రులు సైతం ఛాలెంజ్‌గా తీసుకొని ఆర్‌ఆర్‌ఆర్‌ గెలిపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అనుకున్న ఫలితాలు కంటే మెరుగైన ఫలితాలు కనిపించాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు 26,547 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 80336 ఓట్లు పోలయ్యాయి. 42.08 శాతం ఓటర్లు ఓటు వేశారు. సమీప ప్రత్యర్థి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు 53,787 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 28.06 శాతం ఓట్లు నమోదయింది, కాగా బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు 37,555 ఓట్లు పోలయ్యాయి. 20 శాతం ప్రజలు ఓట్లు వేశారు. ఈ గణాంకాలు బట్టి చూస్తే కొత్తగూడం నియోజకవర్గంలో గెలుపొందిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు 80,336 ఓట్లు వచ్చాయి. ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి కొత్తగూడెం నియోజకవర్గంలో 1,05,102 ఓట్లు పోలయ్యాయి. టిఆర్‌ఎస్‌ అభ్యర్థికి 29,225 ఓట్లు, బిజెపికి అభ్యర్ధికి 27,234 ఓట్లు కోట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే బీఆర్‌ఎస్‌కి పడాల్సిన ఓట్ల సైతం బిజెపికి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు అసెంబ్లీలో 37,555 ఓట్లు పోల్‌ అయినప్పటికీ ఆ ఓటు బ్యాంకు నామా నాగేశ్వరరావుకు పోల్‌ కాలేదు. కేవలం 29, 225 ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే బీఆర్‌ఎస్‌ ఓటర్లు బీజేపి వేశారని తెలుస్తుంది. దీంతో బీజేపి అభ్యర్ధి తాండ్రకు వినోద్‌రావుకు 27,234 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కూటమి నాయకుల సమిష్టి కృషి ఫలితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆర్‌ఆర్‌ఆర్‌కు 1లక్ష ఓట్లు పోల్‌ కావడంతో ఆనందం కనిపిస్తుంది.

Spread the love