చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్ట్‌

చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్ట్‌‘గత రెండేళ్ళుగా నా పూర్తి ఏకాగ్రత చెన్నైలో ప్రతిష్టాత్మ కంగా నిర్మిస్తున్న ‘కళ్యాణ్‌ అమ్యూస్మెంట్‌ పార్క్‌’పై ఉంది. త్వరలోనే అది ప్రారంభ మౌతుంది. బాలకష్ణతో సినిమా చేయా లని ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని నిర్మాత సి కళ్యాణ్‌ చెప్పారు. నేడు (శనివారం) ఆయన పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
సహాయ దర్శకుడిగా నా కెరీర్‌ మొదలైంది. దాదాపు 83 చిత్రాలను చాలా విజయవంతంగా చేశా. నెక్స్ట్‌ బాలకష్ణతో సినిమా ఉంటుంది. నిర్మాతని నిర్మాతగా గౌరవించే కథానాయకుడు ఆయన. అందుకే బాలకష్ణ అంటే మాకు చాలా అభిమానం.
చెన్నైలో ప్రస్టేజియస్‌గా నిర్మిస్తున్న ‘కల్యాణ్‌ అమ్యూస్మెంట్‌ పార్క్‌’ తమిళ్‌ న్యూ ఇయర్స్‌ డేకి ఆవిష్కరించాలని చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రికి కూడా ఈ ప్రాజెక్ట్‌ని త్వరగా ప్రారంభించాలనే ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే సిటీలో ఇలాంటి ప్రాజెక్ట్‌ రావడం అనేది ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రభుత్వం, అధికారులు, అక్కడి ప్రజల నుంచి మంచి సపోర్ట్‌ లభించింది. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్ట్‌ ఇది. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌ని నిర్మించే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.
ఈ పార్క్‌ చాలా వినో దాన్ని పంచుతుంది. ఇండియాలో తొలిసారి అందులో స్కై థియేటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రారంభమైన తర్వాత మంచి ఆదాయం సంపాదిస్తా మనే నమ్మకం ఉంది. వచ్చిన ఆదాయాన్ని సినిమాల నిర్మాణం కోసంవెచ్చిస్తాం. కడదాక సినిమాలు తీస్తూనే ఉంటా. నేను ఎప్పడూ సినిమా ధోరణిలోనే ఉంటాను. వెబ్‌ సిరిస్‌ కూడా సీరియల్‌ మాదిరే. అయితే దానికి బెటర్‌ వెర్షన్‌ తీస్తున్నారు. అయితే అలాంటి శ్రుతిమించిన కంటెంట్‌ నేను చేయలేను. రానురాను డిజిటల్‌ రైట్స్‌ తగ్గిపోతాయి. హీరోలు కూడా ఎక్కువగా వెబ్‌ సిరిస్‌ల వైపు వెళ్తారని భావిస్తాను. వచ్చే ఏడాది బాలకష్ణ సినిమాతోపాటు మరో రెండు చిన్న సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని పరిశ్రమ తరపున తప్పకుండా వెళ్లి కలుస్తాం. కళ్యాణ్‌ అమ్యూస్మెంట్‌ పార్క్‌ లాంటి ప్రాజెక్ట్‌ని ఏపీలో నిర్మించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. వైజాగ్‌లో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిద్దామనే ప్రపోజల్‌ పెట్టాను. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగడం లేదు. దాన్ని మళ్ళీ ఓపెన్‌ చేస్తే విశేషమైన గుర్తింపు వస్తుంది. దాన్ని మళ్ళీ జరపమని రేవంత్‌ రెడ్డిని కోరుతాను. అలాగే చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ని హైదరాబాద్‌కు తీసుకురమ్మని
రిక్వెస్ట్‌ చేస్తాను.
నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్‌ కూడా ఇది తనకి ఒక గౌరవమని గొప్పగా భావించే పరిస్థితి లేదని నా అభిప్రాయం. అవార్డులను జెన్యూన్‌గా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవార్డు వేడుక అంటే పరిశ్రమ అంతా ఒక కుటుంబంలా హాజరవ్వాలి.
మన పండగ అనుకోవాలి.
ఒకప్పుడు అలా జరిగేవి. ఇప్పుడు అవార్డు వచ్చిన వారు తప్పితే మిగతా అందరూ ఇంట్లో కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అవార్డుల వేడుకలు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమతోంది.
– సి.కళ్యాణ్‌

Spread the love