అ “పూర్వ”కలయిక..

నవతెలంగాణ -డిచ్ పల్లి.
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  1995- 96 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.అ సమయం లో తమకు బోధించిన అద్యపకులు, పూర్వ విద్యార్ధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.పదవ తరగతి తర్వాత కొందరు వ్యాపారంలో, వ్యవసాయంలో, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఒకరిని ఒకరు పలుకరిస్తూ యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దాదాపు 27ఎళ్ళ తర్వాత కలుసుకోవడం ఎనలేని అనుభూతి కలిగిందని చెప్పారు.అనంతరం అద్యపకులకు సన్మానించారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు, అద్యపకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love