అమెరికాలో తెలుగు విద్యార్ధికి అరుదైన గౌరవం..

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్ధికి అరుదైన గౌరవం లభించింది. సమాజంలో మార్పు కోసం వినూత్నంగా ఆలోచించే యువతకు అమెరికాలో ప్రిన్సెస్ డయానా అవార్డ్‌తో సత్కరిస్తారు. అమెరికాలో తెలుగు విద్యార్ధి శ్రీ నిహాల్ తమ్మన పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి ఫలితంగా ఈ అవార్డ్ వరించింది. సమాజం కోసం ఆలోచించి మానవత్వంతో స్పందించిన నిహాల్ తమ్మన బ్యాటరీలు ఈ పర్యావరణానికి ఎంత కీడు చేస్తున్నాయనేది చదువుకుని చలించిపోయాడు. దీనికి రీ సైకిలింగ్ ఒక్కటే మార్గమని భావించి బ్యాటరీ రీసైకిలింగ్‌ని చిన్న వయస్సులోనే ఓ ఉద్యమంలా చేపట్టాడు. తన తోటి విద్యార్ధుల సాయంతో ముందుగా ఇళ్లలో వినియోగించిన బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 2,75,000 బ్యాటరీలను నిహాల్ రీసైకిలింగ్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. బ్యాటరీ రీసైకిలింగ్‌పై బడుల్లో అవగాహన సదస్సలు నిర్వహించారు. ఈ సదస్సుల ద్వారా దాదాపు కోటి మందిని పైగా చైతన్యం చేశారు.

read more..

Spread the love

One thought on “అమెరికాలో తెలుగు విద్యార్ధికి అరుదైన గౌరవం..

Comments are closed.