అరుదైన సినిమా

rare
the movieనవీన్‌ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. శ్రీకాంత్‌ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్‌ ములుకుట్ల క్రిషివ్‌ ప్రొడక్షన్స్‌, హ్యాండ్‌పిక్డ్‌ స్టోరీస్‌ బ్యానర్‌పై నిర్మించారు. సుమంత్‌ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఎం.ఎం కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్‌ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ, ‘ఇది చాలా స్పెషల్‌ మూవీ. ఇలాంటి పాత్రలు, సినిమాలు అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు శ్రీకాంత్‌తో వర్క్‌ చేయడం ఇది రెండోసారి. నేను ఈ పాత్ర చేస్తానని బలంగా నమ్మాడు’ అని తెలిపారు.
‘ఈ సినిమాలో ప్రతి పాత్ర ఒక కంప్లీట్‌ సర్కిల్‌తో ఉంటూ గౌరవంతో ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. డైలాగులు గుర్తుంటాయి’ అని స్వాతి రెడ్డి చెప్పారు.
దర్శకుడు శ్రీకాంత్‌ నాగోతి మాట్లాడుతూ,’ఈ సినిమాని ప్యాషన్‌తో తీశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత యశ్వంత్‌ మాట్లాడుతూ,’సినిమా ఫలితంపై మేమంతా చాలా నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు. శ్రేయా మాట్లాడుతూ,’లీడ్‌ క్యారెక్టర్‌లో ఇది నా మొదటి సినిమా. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

Spread the love