కాపురం చెరువులో బయటపడ్డ అరుదైన విగ్రహం

– చెరువు ప్రక్కన కాకతీయుల ఖిల్లాలు
నవతెలంగాణ -మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కాపురం గ్రామంలో కాపురం చెరువులో అరుదైన విగ్రహం బయట పడింది. స్థానికుల పూర్తి కథనం ప్రకారం బుధవారం ఉదయాన్నే గ్రామంలోని కొందరు యువత బహిర్బుమికి వెళ్లిన నేపథ్యంలో చెరువు మత్తడి వద్ద విగ్రహం కనిపించింనట్లుగా తెలిపారు. కాకతీయుల కాలంనాటి ఖిల్లాలను అనుకోని ఉన్న చెరువులో వేసవి కాలం నేపథ్యంలో నీరు తగ్గి చెరువు అడుగంటడంతో అరుదైన విష్ణుమూర్తి విగ్రహం బయట పడిందా లేదా ఎవరైనా గుప్త నిధుల తవ్వకాల్లో భాగంగా బయట పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణం కాపురం గుట్టలు గుప్త నిధుల తవ్వకాలను ఒక పెద్ద అడ్డాగా పేరుంది. గతంలో పురావస్తు శాఖ అధికారులు పలుమార్లు కాకతీయుల కాలంనాటి కాపురం గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.కానీ ఏళ్ళు గడుస్తున్నా దాని ఊసే కరువైంది. ఇప్పటికే కాపురం గుట్టల్లో కాకతీయుల నాటి పురాతన విగ్రహాలు, అరుదైన శిలలు, గుహలు ఉన్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం, పురాతన శాఖ అధికారులు దృష్టి సారిస్తే జిల్లాలోనే  పెద్ద పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Spread the love