మూసీ వరదపై మళ్లీ అధ్యయనం

నవతెలంగాణ – హైదరాబాద్: మూసీ నది గరిష్ఠ వరదపై ఐఐటీ హైదరాబాద్ సహకారంతో మళ్లీ అధ్యయనం చేపట్టనున్నారు. ఇటీవల హైడ్రాలజీ విభాగం మూసీ గరిష్ఠ వరద 1.5 లక్షల క్యూసెక్కులే అని నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారంతో పున:పరిశీలన చేయించిన తర్వాత నిర్ధారణకు రావాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే మూసీ నది సరిహద్దులు ఖరారు చేయాలని నిర్ణయించింది.

Spread the love