– ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీ
– సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం అభ్యర్థిని గెలిపించాలని పిలుపు
– మంచాలలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
– బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే పార్టీ ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు
– 3 మండలాలను చుట్టిన భారీ బైక్ ర్యాలీ
– వేెలాదిగా పాల్గొన్న సీపీఐ(ఎం) శ్రేణులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నంలో ఎర్రదండు కదం తొక్కింది. ఇబ్రహీంపట్నం ఎ మ్మెల్యే సీపీఐ(ఎం) అభ్యర్థికి యాదయ్యను గెలిపించాలని పిలుపుని చ్చింది. ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన సీపీఐ(ఎం) శ్రేణులతో మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు ఎరుపుమయమయ్యాయి. ఈ ర్యాలీని మంచాల మండల కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ ప్రారంభించారు. యాచారం మండలం మేడిపల్లిలో సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలో తీరుపై మండిపడ్డారు. ఉదయం మంచాల మండల కేంద్రంలో ఈ బైక్ ర్యాలీని జాన్ వెస్లీ ప్రారంభించగా మంచాల, జాపాల, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ, బోడకొండ, ఎల్లమ్మ,తండా, రంగాపూర్, చీదేడ్ గ్రామాలను మీదుగా యాచారం మండలంలోని చింతపట్ల, నల్లవెల్లి, మాల్, కొత్తపల్లి, తక్కల్లపల్లి, మేడిపల్లి, నందివనపర్తి, చింతుల, ధర్మన్నగూడ గ్రామాల్లో పర్యటించింది. ఇబ్రహీంప ట్నం మండలంలోని పెద్దతుండ్ల, వెలిమినేడు, కప్పా డు, చర్లపటేల్‌గూడ గ్రామాల్లో పర్యటించి ఇబ్రహీం పట్నంలో ముగించింది. ఈ యాత్ర పొడవున సీపీఐ (ఎం) శ్రేణులకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వా గతం పలికారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పి యా దయ్యను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నా యకులు పిలుపునిచ్చారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో రెటించిన ఉత్సాహంతో సీపీఐ (ఎం) శ్రేణులు బైక్ ర్యాలీ ముందుకే సాగించారు. ము నుపెన్నడూ లేని విధంగా సీపీఐ(ఎం) శ్రేణులు బైక్ ర్యాలీలో ఉత్సవపూరితంగా పాల్గొనడంతో ఈ ప్రాం తంలో కమ్యూనిస్టుల్లో త్యాగాలు, పోరాటాలను పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న పోటీని ప్రజలు సవాలుగా తీసుకోవాలని కోరారు. డబ్బుకు, భూస్వామ్య వ్యవస్థకు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ప్రజల భావిస్తున్నారని చెప్పారు. మేడి పల్లి గ్రామంలో మధు మాట్లాడుతూ… ఈ ప్రాంతం లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు పే దలకు పట్టెడు అన్నం పెట్టాయన్నారు. దొరలు, పెత్తందారులను గ్రామాల నుంచి తరిమికొట్టామన్నా రు. వేలాది ఎకరాల ప్రభుత్వ బంజరు భూములను పేదలకు ఎర్రజెండా నాయకత్వంలోనే పంపిణీ చేశామన్నారు. మేడిపల్లిలో హత్యకు గురైన రోశయ్య త్యాగాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ ప్రాంత కమ్యూనిస్టు శ్రేణులు కృషి చేస్తున్నాయని చెప్పారు. అనేకమంది డబ్బు సంచులతో గ్రామాలకు ఓట్ల కోసం వస్తున్నారని వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రోజుకో పార్టీ మార్చుతూ తమ ఆస్తు లు పెంచుకోవడానికి వస్తున్నాయని విమర్శించారు. కానీ సీపీఐ(ఎం) మాత్రం ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి యా దయ్యను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్రాలను హస్తగతం చేసు కునేందుకు అనేక కుయుక్తులు పన్నుతోందని మండి పడ్డారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికా రంలో రావడానికి తెలంగాణలో బీఆర్‌ఎస్, ఆంధ్రలో జగన్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఓ డిపోతామన్న భయంతో వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వల్ల కేసీఆర్ బయటపడ్డాడన్నారు. మును గోడులో బీజేపీకి బ్రేకులు వేసింది కమ్యూనిస్టుల బల మేనని చెప్పారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో కమ్యూ నిస్టుల తోటే కలిసి పోతానని ఆయా సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆయన కూతురు కవి తపై లిక్కర్ కేసులో అరెస్టు చేస్తారన్న భయంతోనే బీజేపీకి లొంగిపోయాడన్నారు. ఈ సందర్భంలోనే వా మపక్షాలతో తెగ తెంపులు చేసుకున్నారని విమర్శిం చారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో కలిసి పోయేందుకు తమనే ఆహ్వానించిందన్నారు చివరి వరకు సీట్ల సర్దుబాటులో నాన్చుడు ధోరణి అవలం భించడంతో తాము వేరుగా పోటీ చేయాల్సిన పరిస్థి తి వచ్చిందన్నారు. దీనికి కాంగ్రెస్ బాధ్యత వహిం చాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఊసే మరిచారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడుతోందని మండిపడ్డారు. ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీ, బీ ఆర్‌ఎస్ పార్టీలను ఇంటికి సాగనంపాలని పిలుపుని చ్చారు. సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
దున్నేవానికి భూమి కావాలన్న నినాదంతో సాగిన భూ పోరాటాలు బలపడాలంటే భవిష్యత్తులో భూ సమస్యలు పరిష్కారం కావాలన్నా కమ్యూని స్టులు చట్టసభల్లోకి పోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకోసం ఎన్నికల్లో సీపీఐ(ఎం) సుత్తి కోడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వే సి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట రాములు, భూ పాల్, జయలక్ష్మి, స్కైలాబ్ బాబు, జిల్లా కార్యదర్శి కాడి గల్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, మధుసూదన్‌రెడ్డి, చంద్రమోహన్, కవిత, జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు జగన్, అంజయ్య, శ్రీనివా సరెడ్డి, రాంచందర్, గోరింకల నరసింహ, కిషన్, మండల కార్యదర్శులు ఆలంపల్లి నరసింహ, శ్యాం సుందర్, సిహెచ్ జంగయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి సుమలత, అధ్యక్షులు విజయమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శంకర్, కేవీపీఎస్ అధ్యక్షులు ప్రకాష్ కారత్, తదితరులు పాల్గొన్నారు.