అశ్వారావుపేట ప్రాంతంలోనే రిఫైనరీ, ప్యాకింగ్ స్టేషన్ నిర్మించాలి..

– రైతులు సమస్యలు పరిష్కారం మే సొసైటీ లక్ష్యం..
– రైతు బంధు జిల్లా అద్యక్షులు రావు జోగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగుదారుల సమస్యల పరిష్కారం,వారి ప్రయోజనమే లక్ష్యంగా ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ కృషి చేయాలని రైతు బంధు జిల్లా అద్యక్షులు రావు జోగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం ఆయిల్ఫెడ్ కేంద్రీయ నర్సరీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సొసైటీ ప్రధమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సొసైటీ కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య అద్యక్షతన నిర్వహించిన ఈ వార్షికోత్సవం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తూ, ఈ ప్రాంతంలో నూనే ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉండగా రిఫైనరీ పరిశ్రమను సాగే లేని సిద్దిపేట లో ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.అశ్వారావుపేట నియోజక వర్గం,దమ్మపేట మండలంలోని అప్పారావుపేట లోనే ఈ రిఫైనరీ పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేసారు.
అనంతరం సొసైటీ ఏర్పాటు ప్రాధాన్యం,దీని ద్వారా సాధించిన విజయాలు,భవిష్యత్తు కార్యాచరణను సభ్యులకు తెలియజేసారు. చివరిగా పలు తీర్మానాలను సభ ప్రవేశపెట్టింది. దమ్మపేట మండలంలో రిఫైనరీ,ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ నిర్మాణం,అశ్వారావుపేట మండలంలో ఆయిల్ ఫాం పరిశోధనా కేంద్రం,టన్ను ఫాం ఆయిల్ గానుగ ఆడే యూనిట్ ఏర్పాటు,నాణ్యత పేరుతో 50 నుండి 100 కేజీల గెలలు తరుగు పద్ధతిని ఎత్తివేయాలని తీర్మాణం చేసారు. కార్యక్రమంలో సొసైటీ బాధ్యులు తుంబురు మహేశ్వర రెడ్డి,దారా తాతారావు,ఆలపాటి రాంమోహన్ రావు,చీకటి బాలాజీ లు పాల్గొన్నారు.
Spread the love