మధ్య తరగతి జీవితాలకు ప్రతిబింబం

middle class A reflection of livesశివాజీ, వాసుకి ఆనంద్‌ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ’90”. ‘ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ఎంఎన్‌ఓపీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. నవీన్‌ మేడారం సమర్పిస్తున్నారు. శనివారం మేకర్స్‌ ట్రైలర్‌ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. హీరో శివాజీ మాట్లాడుతూ, ‘ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ వెబ్‌ సిరీస్‌. దర్శకుడు ఆదిత్య చాలా అద్భుతంగా తీశారు. నిర్మాత నవీన్‌ చాలా విజన్‌ ఉన్న టెక్నీషియన్‌. వాసుకి చాలా ప్రతిభ ఉన్న నటి. జనవరి 5 నుంచి ఈటీవిన్‌లో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది’ అని తెలిపారు. ‘ఇదొక మంచి వెబ్‌సిరీస్‌. ఇందులో ఓ మంచి పాత్ర పోషించాను. ఇలాంటి సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని వాసుకి చెప్పారు. దర్శకుడు ఆదిత్య హాసన్‌ మాట్లాడుతూ,’రాజశేఖర్‌, నవీన్‌ మేడారం ఇద్దరూ బాగా సపోర్ట్‌ చేశారు. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన సిరీస్‌ ఇది. అందమైన కథతో రూపొందిన ఈ సిరీస్‌ తప్పకుండా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.

Spread the love