ఏబీ వెంకటేశ్వర రావుకు ఊరట..

నవతెలంగాణ – అమరావతి: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మూడు వారాల క్రితం ఏబీ వెంకటేశ్వర్ రావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని తెలిపింది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

Spread the love