పల్లెల్లో  దాహం కేకలు.. కథనానికి స్పందన..

నవతెలంగాణ – చివ్వేంల 
పల్లెల్లో దాహం కేకలు  కధనం  నవతెలంగాణ దినపత్రికలో  ప్రచురించడం జరిగింది. కథనానికి స్పందించిన  సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు,వారి  ఆదేశాల ప్రకారం  మండలంలోని  ఐలాపురం, గాయం వారి గూడెం  గ్రామపంచాయతీలలో  ఆర్డిఓ వేణుమాధవ్  పర్యటించారు. తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిడబ్ల్యూ ఎస్ స్కీం   బోర్ మోటార్లను పరిశీలన చేసి  మాట్లాడారు. గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట  తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
Spread the love