
– మరమ్మత్తులు చేపట్టిన ఐటిడిఎ ఇంజనీరింగ్ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట : ధ్వంసం అయిన రహదారులు,పొందిన ఉన్న ప్రమాదం శీర్షికన శనివారం నవతెలంగాణ లో ప్రచురితం అయిన కథనానికి స్పందన లభించింది. ఉదయాన్నే కధనం చదివిన ఐటిడిఎ ఎ.ఇ.ఇ ప్రసాద్ హుటాహుటిన నారంవారిగూడెం సందర్శించి రహదారులను పరిశీలించారు.మద్యాహ్నం నుండి ప్రోక్లైనర్ తో ధ్వంసం అయిన రహదారులకు ఇరువైపుల మట్టి నింపి ప్రమాదాలు నివారణకు తాత్కాలిక చర్యలు చేపట్టారు. ఎ.ఇ.ఇ ప్రసాద్ మాట్లాడుతు ప్రమాదాలు నివారణకు తాత్కాలిక చర్యలు చేపట్టాం అని నిధులు మంజూరు అయిన వెంటనే కాంక్రీట్ పనులు చేపడతామని తెలిపారు.