నవతెలంగాణ – న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. జులానా నియోజవకర్గం నుంచి పోటీ చేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ ప్రస్తుతం పుంజుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసే వరకు ఆమె తన ప్రత్యర్థి కన్నా 38 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓ దశలో రెజ్లర్ వినేశ్ వెనుకంలో ఉన్నారు. అయిదు రౌండ్ల లెక్కింపు వరకు ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ ప్రస్తుతం వెనుకబడ్డారు.