గచ్చిబౌలీలో రోడ్డు ప్రమాదం..ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైవర్‌పై ఎగిరిపడ్డారు

నవతెలంగాణ-హైదరాబాద్ : గచ్చిబౌలీ ఫ్లైఓవర్‌ పైనుంచి పడి ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇద్దరు యువకులు వేగంగా టూవీలర్‌పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో, ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైవర్‌పై ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రతకు మధు(25) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మధు గచ్చిబౌలిలో నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.

Spread the love