రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Romantic A family entertainerనవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కాబోతోంది. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ని నేడు (సోమవారం) రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబందం అధికారికంగా ప్రకటించింది.
అనౌన్స్‌మెంట్‌ నుంచి అందరిలో ఆసక్తి కలిగించిందీ సినిమా. ఈ ఏడాది మోస్ట్‌ అవేటెడ్‌ మూవీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీకష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఎంజారు చేసేందుకు ఆడియెన్స్‌ ఎదురు చూస్తున్నారు. భిన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు మహేష్‌ ఈ చిత్రాన్ని అద్యంతం అద్భుతంగా తెరకెక్కించారు. అనుష్క తనదైన మార్క్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి సైతం తన నటనా ప్రతిభతో అందర్నీ అలరించడానికి మన ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
అభినవ్‌ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : రధన్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బందా, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: రాఘవ్‌ తమ్మారెడ్డి.

Spread the love