ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ!

ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ!– టీ20 ప్రపంచకప్‌కు బెన్‌ స్టోక్స్‌ దూరం
లండన్‌ (ఇంగ్లాండ్‌) : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ హీరో, స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ ఏడాది ఇంగ్లాండ్‌ టైటిల్‌ డిఫెన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల మోకాలి గాయానికి శస్త్రచికిత్స అనంతరం భారత్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో పోటీపడిన బెన్‌ స్టోక్స్‌.. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే ందుకు రానున్న టీ20 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌ జట్టు సెలక్షన్‌కు అందు బాటులో ఉండలేనని తేల్చిచెప్పాడు. ఈ మేరకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ మేనేజ్‌ మెంట్‌కు బెన్‌ స్టోక్స్‌ సమాచారం అందించాడు. ‘అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించేందుకు ఫిట్‌నెస్‌,బౌలింగ్‌ ఫిట్‌నెస్‌పై కష్టపడుతున్నాను. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉంటున్నాను. భవిష్యత్‌లో నాకు ఇష్టమైన ఆల్‌రౌండర్‌గా ఆటలో కొనసాగేందుకే ఈ త్యాగం. ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్‌లో నేను బౌలింగ్‌ ఫిట్‌నెస్‌లో ఎంత వెనుకబడి ఉన్నానో తెలిసింది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో డర్హమ్‌ తరఫున బరిలోకి దిగుతున్నాను. టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించేందుకు బట్లర్‌, మాథ్యూ మాట్‌, జట్టుకు నా శుభాకాంక్షలు’ అని ఈసీబీ విడుదల చేసిన ప్రకటనలో బెన్‌ స్టోక్స్‌ తెలిపాడు.

Spread the love