ఫ్యాన్ కు షార్ట్ సర్క్యూట్..పేలిన సిలిండర్

నవతెలంగాణ-భువనగిరి రూరల్ : భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఫ్యాన్ కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న పిల్లలు వెంటనే బయటికి రాగా, సిలిండర్ పేలి ఇల్లు మొత్తం దగ్ధమైంది. వీరవెల్లి గ్రామానికి చెందిన సిల్వేరు కుమార్ కిరాణా షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన పని నిమిత్తం తన భార్యతో కలిసి బయటకు వెళ్ళాడు. అదే సందర్భంలో ఫ్యాన్ కు షాట్ సర్య్కూట్ కావడంతో ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. ఇంట్లో ఉన్న పిల్లలు బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లు పేలిపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దహనమైయ్యాయి. సుమారు ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగింది అని అంచనా.

Spread the love