బావిలో పడి ఆరేళ్ల బాలుడి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: నార్సింగిలో ప్రమాదం చోటు చేసుకుంది. బన్నీ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిన్న సాయంత్రం బన్నీ కిరాణా కొట్టుకు వెళ్లాడు. రాత్రి ఎంతకీ తిరిగి రాకపోవడంతో బన్నీ తల్లిదండ్రులు నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని బయటకు తీస్తున్నారు.

Spread the love