నవతెలంగాణ- ఆర్మూర్ పట్టణంలోని
సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో పోలీస్ శాఖలో తమ వంతు విధులు నిర్వహిస్తూ స్వామి బ్లడ్ డొనేషన్ వ్యవస్థాపకులు స్వామి పూలమాల శాలువాతో సన్మానించి ఆర్మూర్ పట్టణంలో చుట్టుపక్క గ్రామాల్లో ఎవరికి ఏ రకమైన రక్త గ్రూపు అవసరమైన రక్తాన్ని అందించి ప్రాణాన్ని రక్షిస్తూ ఆపద సమయంలో ఆపద్బాంధవుడుగా అ దుకుంటున్న స్వామి గారికి ” ప్రాణదాత ” అనే ఉత్తమ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి మాట్లాడుతూ.. నేటి యువత రక్తదానం చేస్తూ ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో తమ వంతు సేవలో ముందుండాలని వారు అన్నారు. అదేవిధంగా నేటి తరానికి పట్వారి తులసి కుమార్ సేవలు ఆదర్శమని వారికి ధన్యవాదాలు తెలిపారు.