మహిళలను గౌరవించే సమాజం ఉన్నతంగా నిలబడుతుంది

నవతెలంగాణ – పెద్దవూర
మహిళలను గౌరవించే సమాజం ఉన్నతంగా నిలబడు తుందని అనుముల ప్రాజెక్టు అంగన్వాడీ సూపర్ వైజర్ గౌసియా బేగం అన్నారు. మంగళవారం మండలం లోని నాయినవాని కుంట తండా లో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లింగ వివక్షపై అవగాహన కల్పించారు. ఈసందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ తల్లి దండ్రులు లింగ వివక్ష లేకుండా చూడాలని ఆడ, మగ ఇద్దరు సమానమే నని అన్నారు.లింగ వివక్ష అనే ఆలోచన ఉండరాదన్నారు. ఆడ, మగ సమానమేనని అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, తమదైన శైలిలో సత్తా చాటుతున్నారని చెప్పారు. లింగ వివక్షకు సంబంధించి సమాజంలో గణనీయమైన మార్పు రావాలన్నారు.ఆడ,మగ ఇద్దరిని సమానంగా చూచినప్పుడు వారిలోఎలాంటి భావన ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నారాయణమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు జహీదా బేగం,
ఆయా శౌరి, గర్భిణీలు రాజేశ్వరి, దివ్య, సునీత, పూజ, బాలింతలు అనూష, కమిలి, తైన, సఖి, పాప, కోటి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love