విహారయాత్రకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

నవతెలంగాణ చింతూరు: స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతం చూసేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌(24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. శని, ఆదివారం సెలవు దినాలు కావడంతో 15 మంది స్నేహితులతో కలిసి చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం చూసేందుకు వెళ్లాడు. జలపాతం వద్ద నీటిలోకి దిగిన హేమంత్‌ ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love