పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

విజయ్, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. గురువారం హీరో విజయ్ బర్త్‌డేని పురస్కరించుకుని మేకర్స్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ తీరు చూస్తుంటే ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. అలాగే యాక్షన్‌ మోడ్‌లో ఉన్న విజయ్ లుక్‌ అందర్నీ అలరిస్తోంది. అలాగే విజరు బర్త్‌ డేకి గిఫ్ట్‌గా ఫస్ట్‌ సింగిల్‌ ‘నా రెడీ..’ లిరికల్‌ వీడియోని కూడా మేకర్స్‌ విడుదల చేసారు. ఫుల్‌ బీట్స్‌తో ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్‌ 19న లియో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.7 స్క్రీన్‌ స్టూడియోపై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మిస్తుండగా, జగదీష్‌ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రిష కష్ణన్‌, సంజయ్ దత్‌, ప్రియా ఆనంద్‌, అర్జున్‌ సర్జా, గౌతమ్‌ మీనన్‌ తదితరులు ఇతర ముఖ్య తారాగణం.

Spread the love