ఆస్తికోసం తల్లిదండ్రులను చితకబాదిన కుమారుడు

నవతెలంగాణ – హైదరాబాద్: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు. ఎత్తుకుని పెంచిన తల్లి గుండెలపైనే కాలితో తన్నాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. కసాయి కొడుకు దెబ్బలకు వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అంతేకాక మరింత రెచ్చిపోయి.. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు కాగా…రెండు ఎకరాల పొలం మరో కుమారుడికి రాస్తావా అంటూ తల్లిదండ్రులపై దాష్టీకం చూపించాడు కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. బూతులు తిడుతూ సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లిని ఈడ్చుకుంటా కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై వీడు మనిషేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కొడుకులు పుట్టొందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spread the love