ఇద్దరు పద్మ విభూషణుల ఆత్మీయ కలయిక…

నవతెలంగాణ- హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలకు పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఈ పద్మ విభూషణులు ఇద్దరి మధ్య ఆత్మీయ కలయిక చోటుచేసుకుంది. వెంకయ్యనాయుడిని కలిసిన చిరంజీవి ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. ఆయన పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వెంకయ్యనాయుడు కూడా చిరంజీవికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఆయనకు మెడలో ఉత్తరీయం వేసి సన్మానించారు. చిరంజీవికి కూడా కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం, పరస్పర ప్రశంసలతో సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఎక్స్ లో పంచుకున్నారు.

Spread the love