రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ కలయినలో రూపొందనున్న బహు భాషా చిత్రం ‘కాంత’. ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్‌లో పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. హీరో వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభం కావడం విశేషం. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ ఛేంజెస్‌ని ఎక్స్‌ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఈ సినిమా ఉండనుంది. రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘వేఫేరర్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్‌ని యాడ్ చేసింది. సురేశ్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీని పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ ‘కాంత” అని అన్నారు. ‘స్పిరిట్ మీడియాతో జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ. ఒక నటుడికి పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తుంది’ అని హీరో దుల్కర్ సల్మాన్ చెప్పారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ,’ఈ సినిమాతో మేం ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పని చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.