కాసేపట్లో కేబినెట్‌ ప్రత్యేక సమావేశం

నవతెలంగాణ- ఢిల్లీ : పార్లమెంట్‌ స్పెషల్‌ సెషన్‌ జరగుతుండగానే.. ఇవాళ కేంద్ర కేబినెట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ భవనంలోనే కేబినెట్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై కేబినెట్‌ చర్చించనుంది. అంతేకాకుండా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కొత్త బిల్లులకు సైతం కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Spread the love