మహిళలకు స్పెషల్‌ షో

A special show for womenనవీన్‌ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. ఈ సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు, స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌, డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌ నుంచి ప్రశంసల్ని, విమర్శకుల నుంచి అభినందనల్ని అందుకుందీ చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్స్‌ సాధిస్తూ, యూఎస్‌లో వన్‌ మిలియన్‌ మార్క్‌ అందుకుందీ సినిమా. తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, ఇండిస్టీ సెలబ్రిటీస్‌కు కథానాయిక అనుష్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ గురువారం ఏపీ, తెలంగాణలోని మహిళల కోసం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ స్పెషల్‌ షో ప్రదర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క మాట్లాడుతూ, ‘మా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్‌. మీ మెసేజెస్‌, ట్వీట్స్‌, ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గురువారం ఏపీ, తెలంగాణలోని థియేటర్స్‌లో లేడీస్‌ కోసం మా మూవీ స్పెషల్‌ షో ప్రదర్శిస్తున్నాం. మీ ఇంట్లో చిన్నవాళ్లను, పెద్ద వాళ్లను ఈ స్పెషల్‌ షోకు తీసుకువెళ్లండి. మీ రెస్పాన్స్‌ కోసం వేచి చూస్తుంటాను’ అని చెప్పారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథతో ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మాణంలో దర్శకుడు మహేష్‌ బాబు.పి తెరకెక్కించారు.

Spread the love