పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

– 26 ఏండ్ల తర్వాత కలిసిన పూర్వవిద్యార్థులు
నవతెలంగాణ-కందుకూరు
26 ఏండ్ల తర్వాత 10వ తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మీర్‌ఖాన్‌పేట్‌ గ్రామంలో మంగళవారం నిర్వహించారు. 1997-98 పదవ తరగతి బ్యాచ్‌ ఉన్నత పాఠశాల మీర్‌ఖాన్‌పేట్‌ చదువుకున్నారు. అలనాటి పూర్వవిద్యార్థులు నాడు విద్యార్థులుగా విద్యను అభ్యసించి వారు నేడు ఉన్నత చదువులు చదివి పెరిగి పెద్దయి అయిన ఆత్మీయ సమ్మేళ నం తో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
మీ పిల్లలకు విలువ నేర్పండి
పిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పించాలని ప్రధానోపాధ్యాయులు జంగయ్య నాటి పూర్వవిద్యార్థులకు సూచించారు. ఆత్మీయ సమ్మేళనం అనం తరం ఆయన మాట్లాడుతూ..మీరు క్రమశిక్షణతో విద్యనభ్యసించి, ప్రణా ళికబద్ధంగా విద్య నేర్చుకున్నారని తెలిపారు. ఉన్నత విద్యను చదివి ఉద్యో గాలు పొందడం, వ్యాపారం, వివిధ రంగాల్లో ప్రావీణ్యం కనబర్చి ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. అప్ప టి రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం లేదన్నారు. పిల్లలతో స్నేహంగా ఉంటూ నైతిక విలువలు నేర్పుతూ ఉన్నతమైన విలువలు పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు. గురువులను ఆత్మీయ సమ్మేళనంలో జ్ఞాపికలతో సన్మా నించడంతో సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూ ర్యనారాయణ, ప్రభాకర్‌రావు, లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి, వెంకటేశం, కిషన్‌రెడ్డి, విజయభాస్కర్‌ రాజు, రమాదేవి, విద్యార్థులు పాలజనార్ధన్‌, డేరం గుల వెంకటేష్‌, కానుగుల గోవర్ధన్‌, కాకి గణేష్‌, రామచంద్రయ్య, జ హం గీర్‌ పాష, సతీష్‌, యాదయ్య, అమరేందర్‌ రెడ్డి, వెంకటేష్‌, రాము, మ ల్లేష్‌, పర్వతాలు, చక్రపాణి, జంగయ్య, శేఖర్‌, రమేష్‌, శ్రీకాంత్‌ శ్రీనివాస్‌, కల్ప న, నీలిమా, కవిత, స్రవంతి, ధనలక్ష్మి, రజిత, సరిత ప్రసన్న లత ఉన్నారు.

Spread the love