– గణేష్ నిమజ్జనంలో ఘటన
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో కత్తిపోట్ల కలకలం గణేష్ నిమజ్జనం సందర్భంగా ఘటన జరిగింది. గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికి వెళ్లిన అన్నదమ్ములపై అల్లరి మూక దాడి చేసింది. ఈ ఘటన ను సీరియస్ గా తీసుకున్న మూడో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఒకరు కత్తిపోట్లకు గురయ్యారు. సంజీవయ్య కాలనీకి చెందిన అజేయ్ గణేష్ నిమజ్జన ఉత్సవాలను చూసి వస్తుండగా బుధవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో స్థానిక యువకులు అటకాయించారు. తాగిన మైకంలో ఉన్న వారంతా అజేయ్ ఫై చెయ్ చేసుకున్నారు. అక్కడే ఉన్న అతని అన్న అర్వింద్ వచ్చి తమ్ముడిని ఎందుకు కొడుతున్నారంటూ అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో వారు కత్తులతో దాడి చేయడంతో అర్వింద్ కత్తి పోట్లకు గురయ్యాడు. అతని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామాన్ని మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ గురువారం తెలియజేశారు.