దివిసీమను బెంబేలెత్తించిన గాలివాన…

నవతెలంగాణ – కృష్ణా
కృష్ణా జిల్లా దివిసీమలో నిన్న సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై అడ్డంగా పడ్డాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నాగాయలంకలో నదిలో కట్టిన పడవలు ఊగిపోయాయి. లంగరు వేసిన ఓ మరపడవ గాలి ఉద్ధృతికి కిలోమీటరు దూరం కొట్టుకుపోయింది. అవనిగడ్డ రూరల్ మండల పరిధిలోని పులిగడ్డలో వీచిన ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. పలుచోట్ల రేకులు షెడ్లు కూలాయి. పక్షం రోజులుగా ఎండలతో అల్లాడిపోయిన దివిసీమ వాసులు చల్లబడిన వాతావరణంతో సేదదీరినా గాలులు మాత్రం వారిని భయపెట్టాయి.

Spread the love