కుప్పంలో జరిగిన కథ..

కుప్పంలో జరిగిన కథ..హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘సెహరి’ ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ది రివోల్ట్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌.
తాజాగా ఈ చిత్ర టీజర్‌కి సంబంధించి మేకర్స్‌ అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్ర టీజర్‌ ఈనెల 27న విడుదల కానుందంటూ అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌లో నిప్పుల కొలిమిలో ఓ ప్రత్యేకమైన ఆయుధాన్ని కాల్చుతూ ఇంటెన్స్‌ లుక్‌లో ఉన్న సుధీర్‌ బాబు అందరిలోనూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్‌, అక్షర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో సుధీర్‌ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పబోతున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్‌ ద్వారక, సంగీతం – చైతన్‌ భరద్వాజ్‌, డీవోపీ – అరవింద్‌ విశ్వనాథన్‌, ఎడిటర్‌ – రవితేజ గిరిజాల.

Spread the love