వేజ్‌ బోర్డును అడ్డుకుంటే సమ్మె తప్పదు

– ఎస్సీఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
– జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహారావు
నవతెలంగాణ -కోల్‌బెల్ట్‌
11వ వేజ్‌ బోర్డును అధికారులు డిపిఈ గైడ్లైన్స్‌ పేరుతో అడ్డుకుంటే 72 గంటల సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీఐ సభ్యులు మందా నరసిం హారావు సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే వన్‌ గనిలో ఫిట్‌ సెక్రటరీ తోట రమేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆ సంఘం భూపాలపల్లి బ్రాంచ్‌ మాజీ అధ్యక్షులు వంగాల రామస్వామి మృతిచెందగా నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్త కార్మికుల పట్ల కక్షతోనే డిపిఈ నిబంధనలను రూపొందించిందని, దాని ఆధారంగానే అధికారుల సంఘం కోర్టుకు వెళ్లిందని అన్నారు. దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బొగ్గు గని కార్మికుల అమలైన వేతన ఒప్పందంపై చర్చ జరిపి వేతనాల చిచ్చుకు కారణమైన డిపిఈ నిబంధనలను ఎత్తివేయాలని కోరారు. లేదంటే అక్టోబర్‌ 5 ,6, 7 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేస్తా మని హెచ్చరించారు. వినతి పత్రాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ కోల్‌ బెల్ట్‌ ప్రజాప్రతినిధులు స్వంతింటి కలపై, కార్మిక సమస్యలపై శాసన సభలో మాట్లాడ కుండా గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. చివరకు కార్మికుల వేతనాలపై అధికారులు కోర్టుకు వెళ్లిన విష యంపై, కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి బొగ్గు దిగుమతిని తప్పనిసరి చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంటులో లేవనెత్తాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇచ్చే బకాయిలను ఇప్పించాలన్నారు. గనులపై టీబీజీకేఎస్‌ నాయకులు కార్మికుల సమస్యలు ఉన్నా యని వస్తున్నారని ఆసమస్యలను గెలిచినప్పటి నుండి ఎందుకు యాజమాన్యంతో చర్చించి పరిష్క రించలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసం జరిగిన సమావేశంలో డైరెక్టర్‌ అన్ని యూనియన్లను సమా నంగా గుర్తిస్తూ సర్క్యులర్‌ జారీ చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. సమస్యలపై అనునిత్యం కార్మికులకు అవగాహన కల్పిస్తున్న సింగరేణి కాలరీస్‌ ఎంప్లా యిస్‌ యూనియన్‌ను ఆదరించాలని కార్మికులను కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్‌ కార్యదర్శి కంపేటి రాజయ్య, నాయకులు కంచ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love