నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాటర్ సప్లయ్, స్ట్రీట్ లైట్స్, గార్డెన్, ఫిల్టర్ బెడ్స్ లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ.19,500 ఇవ్వాల్సి ఉండగా రూ.16500 వేతనం అమలు చేస్తున్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం రూ.19,500 ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ గత సంవత్సర కాలంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి అనేక వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది అని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ ఆధ్వర్యంలో మంగళవారం అందజేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కి, లేబర్ కమిషనర్ కి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ లకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు.అయినా సరే మున్సిపల్ కార్పొరేషన్ నుండి కనీస స్పందన రాకపోవడంతో, కార్మిక చట్టాలను అనుసరించి చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇవ్వాలని నిజామాబాద్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్ణయించింది. ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన 15 రోజుల లోపు కార్మికులకు కనీస వేతనం రూ.19,500 అమలు చేస్తున్నట్లు ప్రకటించకపోతే ఆగస్టు మొదటి వారంలో ఎప్పుడైనా కార్మికులు సమ్మెలోకి వెల్లారని తెలియజేస్తున్నాము.