ఖోఖో ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి

A student collapsed while playing Khokho– ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి
నవతెలంగాణ-నార్నూర్‌
ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం భీంపూర్‌ గ్రామ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో గురువారం ఖోఖో ఆడుతూ 9వ తరగతి విద్యార్థి రాథోడ్‌ రవి (బన్నీ) కుప్పకూలాడు. ఎంఈఓ అనిత తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి మూడు నెలల కిందట పాఠశాలలో చేరాడు. చిన్న తనంలోనే గుండెకు చికిత్స జరిగింది. గణతంత్ర దినోత్సవ క్రీడాపోటీల్లో భాగంగా గురువారం తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల్లో పాల్గొన్నాడు. ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దివ్యశ్రీ ఫౌండేషన్‌ చైర్మెన్‌ దారావత్‌ ప్రవీణ్‌ నాయక్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదుకుంటామని భరోసా కల్పించారు.

Spread the love