నవతెలంగాణ -హైదరాబాద్: ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి హాస్టల్‌లో ఉరివేసుకుని మరణించాడు. ఈ ఘటన తిరుపతి మంగళం సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన శివప్రసాద్ (19) సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లకుండా తాను ఉన్న రూమ్‌లో ఫ్యాన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రూయా మార్చురీకి తరలించారు. దీనిపై విచారణ చేపట్టారు.