నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో పశ్చిమబెంగాల్ కు చెందిన నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంవత్సరం కాలంగా నాచారం లోని హాస్టల్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజిమా బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం సాయత్రం హాస్టల్ రూం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది సంజీమా. పోలీసులకు సమాచారం అందించారు హాస్టల్ నిర్వాహకులు. ఈ తరుణంలోనే.. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… సంజీమా మృతదేహాన్ని గాంధీకి తరలించడం జరిగింది. ఇక వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజిమా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజిమా సుసైడ్ పై కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.