నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వెలువడిన ఎంసెట్ ఫలితాలలో శ్రీచైతన్య డిడి కాలనీ బ్రాంచ్ లో చదువుతున్న చైతన్య అనే విద్యార్ధి ర్యాంకు తక్కువగా రావడం వల్లన మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతికి కార్పోరేట్ కళాశాలల ర్యాంకులు, మార్కుల దాహామే కారణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. ఎల్. మూర్తి, టి. నాగరాజులు అన్నారు. తక్కువ ర్యాంకులు, మార్కులు ఆసమానతలు వల్లన విద్యార్ధులు మార్కులు, ర్యాంకులు సాధించకపోతే జీవితం వృధా అనే భ్రమలు కల్పిస్తున్నారని వారు అన్నారు. ఈ కార్పోరేట్ విద్యాసంస్థలను రద్దు చేయకుంటే విద్యావ్యవస్థ మరింత సంక్షోభంలోకి వెళ్తుందని తెలిపారు. విద్యార్ధులు మార్కులు, ర్యాంకులే జీవితం కాదు.ఎవరు అధైర్య పడకుండా జీవితాన్ని మధ్యలో నష్టపోకుండా ఉండాలని ఎస్ఎఫ్ఐ కోరింది. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థికి కారకులను ప్రభుత్వం తక్షణమే శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.