జాతీయ హ్యాండ్ బాల్ నేషనల్ గేమ్స్ లో ఆడిన ఎడ్లపల్లి విద్యార్థి


నవ తెలంగాణ మల్హర్ రావు: జాతీయ హ్యండ్ బాల్ నేషనల్ గేమ్స్ లో మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన విజయగిరి లక్ష్మీ సమ్మయ్య దంపతుల రెండోవ కుమారుడు విజయగిరి సాయికృష్ణ హ్యండ్ బాల్ పోటీలకు ఎంపికై ఆడాడు. ఇందుకు తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేసి సాయిని అభినందించారు. సాయి కృష్ణకు క్రీడా పరంగా చాలా ఆసక్తి ఉన్నందున తెలంగాణ హ్యాండ్ బాల్ కోచ్ ఏ.ప్రవీణ్ కుమార్ గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన ఆటలో ఎంతో నైపుణ్యత కనబరిచి దాన్ని గుర్తించినందుకు తల్లిదండ్రులు కోచ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హర్యానాహిసారలో అండర్ 19, ఎస్ టి ఎఫ్ హ్యాండ్ బాల్ నేషనల్ గేమ్ ఈనెల 5 నుండి 9వరకు జాతీయ హ్యాండ్ బాల్ నేషనల్ గేమ్స్ ఆట మంచి ప్రతిభ కనబరిచి తెలంగాణ హ్యాండ్ బాల్ టీం ప్రథమ స్థానం రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. సాయి టీంలో మహబూబ్నగర్ హ్యాండ్ బాల్ సంఘం సభ్యులు వేణుగోపాల్, బాలరాజ్, మహమ్మద్ హుస్సేన్, పద్మని, శంకర్ పాల్గొన్నారు.

Spread the love