రాజధానికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన విద్యార్థిని…

నవతెలంగాణ – హైదరాబాద్: ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే వైద్య విద్యార్థిని రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విరాళం అందజేశారు. పొలం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, బంగారు గాజులు అమ్మి పోలవరం కోసం మరో రూ.1 లక్ష విరాళంగా ఇచ్చినట్లు పేరెంట్స్ తెలిపారు. తన తండ్రి మనోజ్‌తో కలిసి సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. వైష్ణవిని అభినందించిన CM ఆమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

Spread the love