శివ కందుకూరి హీరోగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర’. ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఈనెల 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ హించింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ మాట్లాడుతూ, ‘ట్రైలర్, టీజర్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉన్నాయి. ‘ఆర్‌ఎక్స్ 100′ విడుదలకు ముందు ఎలాంటి వైబ్స్ ఉండేవో ఇప్పుడు అలానే అనిపిస్తుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు. ‘ప్రతి యాక్టర్‌కి ఒక బకెట్ లిస్టు ఉంటుంది. ఫైట్స్, డ్యాన్స్ చేయాలి, మాస్ పాటలు ఉండాలని అనుకుంటాం. ఇవన్నీ నాకు ‘మను చరిత్ర’ కంప్లీట్ చేసింది’ అని హీరో శివ కందుకూరి చెప్పారు. దర్శకుడు భరత్ పెదగాని మాట్లాడుతూ,’ఇది చాలా స్వచ్చమైన కథ’ అని తెలిపారు.