నిజామాబాద్ ఇంచార్జ్ పోలిస్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాటిక, పాటలతో గ్రామస్తులకు పలు నేరాలపై అవగాహన కల్పించారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి యొక్క త్యాగాలను గ్రామస్తులకు నాటిక రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఎస్ ఐ నరేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తుంటారని ప్రపంచమంతా నిద్రపోతున్నా తాను మాత్రమే మేల్కొని డ్యూటీ చేసేది ఒక్క పోలీసు మాత్రమే అని కొనియాడారు. కుటుంబాన్ని పండగలు పబ్బాలను సైతం త్యజించి… ప్రజల కోసం పనిచేసే రక్షక భటుల సేవలు అనిర్వచనీయం అని తెలియజేశారు. ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తదని తెలిసినా వెనుకడుగు వేయని ధీరులు అసలు పోలీసులు లేని వ్యవస్థను ఊహించలేమని, ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ విధి నిర్వహణలో ఎందరో అమరులైన సంఘటనలు ఉన్నాయి అని అన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలనీ, మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని సూచించారు. విద్యార్థినుల భద్రత కోసం రక్షణగా నిజామాబాద్ షీ టీమ్ రక్షణ కల్పిస్తుందనీ తెలిపారు.మహిళలు అత్యవసర పరిస్థితుల్లో నిజామాబాద్ షీ టీమ్ నంబర్ 8712659795 ,డయల్ 100 కి ఫోన్ చేయాలని అన్నారు. మీ మొబైల్ ఫోన్ దొంగిలించిన, పోగొట్టుకున్న సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరి చేయడం జరుగుతుందినీ తెలిపారు.ఆన్లైన్, సైబర్ మోసాలు గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు,దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేయాలని తెలిపారు. కళాబృందం వారు చక్కని నాటిక, పాటల రూపంలో సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు లేనిపోని ఆశలు అత్యాశలు చూపించి మోసం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలు వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కళాబృందం సిబ్బంది విక్రమ్, సీత పాల్గొన్నారు.