త్వరలో రాష్ట్రానికి ఎల్‌ఎస్‌ కంపెనీ బృందం

A team of LS Company to the state soon– వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుపై కొరియన్‌ సంస్థల ఆసక్తి
– కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌ ేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దక్షిణ కొరియాలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థ అయిన ఎల్‌ఎస్‌ కంపెనీ ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎల్‌ఎస్‌ గ్రూప్‌ చైర్మెన్‌ కు.జా.యున్‌తోపాటు ఆ కంపెనీ సీనియర్లతో భేటీ అయింది. ఈ సమావేశంలో తెలంగాణలో ఎలక్ట్రిక్‌ కేబుళ్లు, గ్యాస్‌, విద్యుత్‌ బ్యాటరీల ఉత్ప్తి, సంబంధిత పరిశ్రమలకు పెట్టుబడులపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో సీఎం ఆహ్వానం మేరకు ఎల్‌ఎస్‌ బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించేందుకు అంగీకరించింది. గతంలో ఈ కంపెనీ ఎల్‌జీ గ్రూపులో భాగస్వామిగా ఉండేది. మరోవైపు వరంగల్‌లోని టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్‌ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌ పిలుపు మేరకు కొరియ్‌ జౌళి పరిశ్రమ సమాఖ్య సానుకూలతను వ్యక్తం చేసింది. సోమవారం దక్షిణ కొరియాలోని సియోల్‌లో కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఇండిస్టీ (కేవోఎఫ్‌వోటీఐ) ఆధ్వర్యంలో బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. యాంగాన్‌ చైర్మెన్‌ కిహక్‌ సుంగ్‌, కేవోఎఫ్‌వోటీఐ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మెన్‌ సోయాంగ్‌ సహా 25 భారీ జౌళి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుతోపాటు రాష్ట్రంలోని టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న సానుకూలతలను సీఎం ఈ సందర్భంగా వారికి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ ఆయన కోరగా, కొరియల్‌ టెక్స్‌టైల్‌ కంపెనీలు సానుకూలంగా స్పందించాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Spread the love