పీఎల్‌ఆర్‌ ప్రసాదరావుకు కన్నీటి వీడ్కోలు

ఒంగోలు : నవ తెలంగాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్‌ సోదరుడు, వ్యాపారవేత్త పంగు లూరు ప్రసాదరావు అంత్యక్రియల ను గురువారం నిర్వహించారు. బంధువులు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలులోని ఆయన నివాసం చెన్నకేశవ నగర్‌ నుంచి ఒంగోలు బస్టాండ్‌ వద్ద ఉన్న మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర చేపట్టారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా ప్రసాద్‌ భౌతకకాయం వద్ద ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీదాస్‌, సీజీఎం అచ్యుతరావు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ప్రజాశక్తి జీఎంలు తిరుపాల్‌రెడ్డి, హరికిషోర్‌, గడ్డన్న, నవతెలంగాణ ఇన్‌చార్జీ ఎడిటర్‌ ఆర్‌. రమేశ్‌, జీఎంలు అంబటి వెంకటేశ్‌, భరత్‌, రఘు, శశిధర్‌, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు కె.ఎన్‌. హరి, బి. బసవపున్నయ్య, బివిఎన్‌ పద్మరాజు, మేనేజర్లు వీరయ్య, కిష్టారెడ్డి, గురుదీప్‌ తదితరులు ఉన్నారు.

Spread the love