సాగర్ లో దట్టంగా అలుముకున్న పొగమంచు

నవతెలంగాణ నాగార్జునసాగర్: నిత్యం క్షణం తీరిక లేకుండా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి.నాగార్జునసాగర్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అలుముకుంది. మేఘాలు నేలను ముద్దాడినట్టుగా పట్టణంలో ఎటు చూసినా శీతల ప్రదేశంతో కూడిన కాశ్మీర్ అందాలను తలపించింది. దీంతో ఈ ఏడాదిలో ఇలా పొగ మంచు అలుముకోవడం మూడవసారి పట్టణవాసులను కనువిందు చేసింది. మరోవైపు మార్నింగ్ వాకర్స్ కు, రోడ్డుపై వాకింగ్ చేయడానికి వెళ్లి పొగ మంచు అందాలను వీక్షించారు. నిత్యం పరిమితిని మించిన వేగంతో వెళ్లే వాహనాలు పొగ మంచును చీల్చుకొని ముందుకు వెళ్తున్నాయి.

Spread the love