థ్రిల్‌ చేసే స్పై

నిఖిల్‌ సిద్ధార్థ్‌, ఐశ్వర్యమీనన్‌ జంటగా నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘స్పై’. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక సత్యం మాల్‌లోని ఏషియన్‌ అల్లు అర్జున్‌ సినిమాస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ మాట్లాడుతూ, ‘మేము అనుకున్న కథను అనుకున్నట్లు చాలా బాగా తీశాం. సినిమా బాగుంటుందనే నమ్మకంతో బయ్యర్లంతా హ్యాపీగా ముందుకొచ్చారు. డైరెక్టర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాను చివరి నిమిషం వరకు చెక్కుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్‌ నుంచి ఒక్క కట్‌ కూడా లేకుండా యు/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. రానా కథ చెప్పగానే ఎంతగానో నమ్మి చేశారు. ఆయన నిజంగా సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అందరినీ ఈ సినిమా ఎంతగానో థ్రిల్‌ చేస్తుంది’ అని చెప్పారు.’ఇలాంటి సినిమాలు అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఈ మూవీలో నేను రెండు పాటలు చేశాను. త్వరలో ఒక బ్యాంగర్‌ సాంగ్‌ రిలీజ్‌ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయేలా ఉంటుంది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌, ఎమోషనల్‌ స్టఫ్‌తో సాంగ్స్‌ ఉంటాయి. ఈ సినిమాకు పని చేయడం సంతోషంగా ఫీలవుతున్నా’ అని సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల అన్నారు. హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌ మాట్లాడుతూ, ”ట్రైలర్‌ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్‌ తెలుగు సినిమా. ఇలాంటి టీమ్‌తో వర్క్‌ చేయడం నా అదష్టం. నిఖిల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్‌ గ్యారీకి రుణపడి ఉంటా’ అని తెలిపారు. ‘క్వాలిటీ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. ‘స్పై’ నుంచి రిలీజ్‌ అయిన ప్రతి కంటెంట్‌ను అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా ఒక బెస్ట్‌ రిలీజ్‌ జరుగుతుంది. ఈ సినిమాలో రానా యాక్ట్‌ చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్‌. ఆయన పాత్ర ఎంత బాగుంటుందో సినిమాలో మీరే చూస్తారు. నిఖిల్‌కి ది బెస్ట్‌ థియేటర్స్‌ ఇస్తున్నాం. ప్రతి కంట్రీలో, ప్రతి స్టేట్‌లో అన్ని లాంగ్వేజస్‌లో ది బెస్ట్‌ క్వాలిటీతో, ది బెస్ట్‌ స్టోరీతో హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కొట్టబోతున్నాం’ అని సీఈవో చరణ్‌ తేజ్‌ అన్నారు.ల

Spread the love