నవతెలంగాణ – మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ ఇటార్సీ రైల్వే జంక్షన్ వద్ద ప్యాసింజర్ రైలు రెండు కోచ్‌లు పట్టా తప్పాయి. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం తప్పినప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైలు నంబర్ 01663 సహర్సా బీహార్ వెళ్లడానికి రాణి కమలాపతి స్టేషన్ నుంచి బయలుదేరింది. రైలు దాదాపు సాయంత్రం 6.15 గంటలకు ఇటార్సీ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. దీనికి కొద్ది నిమిషాల ముందే రైలులోని రెండు ఏసీ కోచ్ బీ1, బీ2 బోగీల పట్టాలు తప్పాయి. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తున్నది. అయితే, ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చేందుకు స్థానిక రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఆయా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.