ప్రమోషన్స్ తో కూడిన ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ని అమలు చేయాలి

– రాయి పెళ్లి యాకయ్య గౌడ్ ఉపాధ్యాయుడు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందే ప్రకటించినట్లుగా ప్రమోషన్స్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ని అమలు చేయాలని కొమ్మనపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు యాకయ్య గౌడ్ డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా తొర్రుర్ మండలంలోని కొమ్మనపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రాయిపెల్లి యాకయ్య మాట్లాడుతూ 21 సంవత్సరాల నుండి ఎస్జీటీగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడినటువంటి ఉపాధ్యాయులకు ఇన్ని సంవత్సరాలు తర్వాత ప్రమోషన్ కల్పిస్తూ చేయడం సంతోషమైనప్పటికీ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ నుండి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్స్ తప్ప ఎస్ జి టి ల నుండి స్కూల్ అసిస్టెంట్స్ గా మరియు పండిట్ పీఈటీల ప్రమోషన్స్ చేయకుండా ట్రాన్స్ఫర్ షెడ్యూల్ విడుదల చేయడం బాధాకరమన్నారు అన్నారు
ప్రమోషన్స్ ఇవ్వకపోవడం వల్ల ఒకవైపు ట్రాన్స్ఫర్స్ అయినటువంటి కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు సబిస్ట్యూట్ లేక రిలీవ్ గాక  ఇప్పటికిప్పుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఎస్జీటీల ల బదిలీలు చేసినట్లయితే రాబోయే కాలంలో మళ్లీ ప్రమోషన్స్ ఇస్తే ఆయా స్థానాలు ఖాళీ అయి ప్రైమరీ విద్యావ్యవస్థలో ప్రతిష్టంబన కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మరోసారి పునరాలోచించి కొద్దిరోజుల సమయం తీసుకుని అయినా సరే ప్రమోషన్స్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ చేస్తేనే వ్యవస్థకు ఉపాధ్యాయులకు నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. పేద బిడ్డలు చదువుకుంటున్నటువంటి బడుగుల పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం మరొకసారి పునః పరిశీలించి ముందే ప్రకటించినట్లుగా ప్రమోషన్స్ తో కూడిన బదిలీలనే అమలు చేసే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
Spread the love