నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ సమీపంలో రాత్రి కురిసిన ఈదురు గాలులకు మహావృక్షం నేలకొరవడమే కాకుండా రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వాహనాలకు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారడంతో, సంబంధిత శాఖ అధికారులు వెంటనే అట్టి వృక్షాన్ని తొలగించినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానిక ప్రజలు కోరుతున్నారు.