పీహెచ్ డీ  పట్టా అందుకున్న గిరిజనవాసి

నవతెలంగాణ – చివ్వెంల
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ పట్టాను అందుకోవడం గర్వకారణంగా ఉందని ధారావత్ నాగేష్ అన్నారు. మండల పరిధిలోని జయరాం గుడి తండా గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమైన హలవతండాకు చెందిన ధారావత్ నాగేష్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఎస్ ఎస్ యు టి ఎం ఎస్ యూనివర్సిటీ 2024 సంవత్సరంలో పూర్తిచేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ పట్టాను అందుకున్నారు. గిరిజన గ్రామంలో పుట్టి బీటెక్ ,ఎంటెక్, పిహెచ్డి చేసి పట్టా అందుకోవడంతో గిరిజన జాతికే అత్యుత్తమ సంతోష్ దగ్గర విషయమని గ్రామస్తులు అతని కొనియాడారు. గిరిజన విద్యార్ధులు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఉద్యోగాలు ,పురస్కారాలు లను గ్రామంలోని తోటి యువత అందుకోవాలని ఆయన కోరారు.
Spread the love